మీరు రాజస్థాన్ వెళ్లాలనుకుంటే మాత్రం నాగౌర్ ఫెయిర్ జాతరను అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రత్యేకంగా టూరిస్ట్ లకోసమే ఈ జాతర చేస్తారు.ఫెయిర్‌లో జంతు ప్రదర్శనను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఈ జాతర ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతుంది. దీనిని రామ్‌దేవ్‌జీ పశువుల జాతర లేదా నాగౌర్ పశువుల జాతర అని కూడా పిలుస్తారు.ఒంటెలతో పాటు ఆవులు, గుర్రాలు, గొర్రెలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం కూడా ఇక్కడ జరుగుతుంది. నాగౌర్ ప్రదర్శన ప్రత్యేకంగా టూరిస్ట్ లు అట్రాక్ట్ చేయడానికి జరుగుతుంది. ప్రజలు తమ జంతువులను ఈ జాతరకు తీసుకురావడానికి ముందు వాటిని బాగా అలంకరిస్తారు. నాగౌరి జాతి ఎద్దులను ఇక్కడ పెద్దఎత్తున విక్రయించడం జరుగుతుంది. ఈ పండుగ ప్రధాన ఆకర్షణ మిర్చి బజార్, నాగౌర్ యొక్క ఎర్ర మిరపకాయ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా చెక్కతో చేసిన అందమైన చెక్కిన వస్తువులు, ఇనుముతో చేసిన వివిధ వస్తువులు, తోలుతో చేసిన వస్తువులు కూడా ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వస్తువులను కొనుగోలు కూడా చేయవచ్చు. ఈ జాతరలో టగ్ ఆఫ్ వార్, ఒంటెల నృత్యం మరియు గుర్రపు నృత్యంతో సహా అనేక ఆటలు కూడా నిర్వహించబడతాయి.