ముస్లింల షబ్-ఇ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీన సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్లో ఫిబ్రవరి 8న షబ్-ఇ-మెరాజ్కి సెలవు ప్రకటించింది. అయితే ఇది సాధారణ సెలవు కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. అయితే.. షబ్-ఇ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. దీంతో ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోజున అన్ని విద్యాసంస్థలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించారు.