Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఫోటో జర్నలిస్ట్ కృష్ణపై రౌడీ మూకల మూకుమ్మడి దాడి

ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై రౌడీ మూకల మూకుమ్మడి దాడి

రాప్తాడు సిద్ధం సభలో దుశ్చర్య

ప్రజాభూమి బ్యూరో, అనంతపురము

అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న “సిద్ధం” సభలో అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై అల్లరి మూకలు మూకుమ్మడి దాడి చేసి
విచక్షణారహితంగా తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం అనంతపురంలోని పావని ఆస్పత్రికి తరలించారు. జర్నలిస్టులపై, ఫొటో జర్నలిస్టులపై దాడులు చేయడాన్ని, రాక్షసంగా ప్రవర్తించడాన్ని పలు మీడియా సంఘాలు, ప్రజాసంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. కృష్ణ పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, చట్టపరంగా జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

  • ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి

అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్లిన ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా ముకుమ్మడి దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. వైసీపీ అల్లరి మూకలు తమ పైశాచికత్వాన్ని జర్నలిస్టులపై చూపించడం క్షమించరాని నేరం. యాజమాన్యాలు, పార్టీలు ఏవైనా ప్రజాస్వామ్య బద్దంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఫోటో జర్నలిస్టులపై దాడులకు పాల్పడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. బాధ్యులైన నిందితులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. ఇకనైనా ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ, చట్టపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. ‌- కేపీ.కుమార్, ఎడిటర్, ప్రజాభూమి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు

ఏఐటీయూసీ ఖండన సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ జిల్లా గాయపడిన ఏబీఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణ ఒక్కసారిగా వందల మంది వైసీపీ అల్లరి మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచడం హేయం. పోలీసుల సమక్షంలో ఇంత జరిగినా ఒక్కరు కూడా అడ్డుకోకపోవడం హేయము.
-వడ్డే ఉప్పు శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి ,ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం(ఏఐటీయూసీ),అనంతపురం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article