ఓ వైపు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతుంటే… మరోవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత సూచీలు పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 71,645కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 21,697 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (4.40%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.49%), యాక్సిస్ బ్యాంక్ (1.57%), ఎన్టీపీసీ (1.32%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.12%).
టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-2.38%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.26%), జేఎస్ డబ్ల్యూ (-2.03%), టైటాన్ (-1.93%), బజాజ్ ఫైనాన్స్ (-1.75%).