సిద్ధం సభ కోసం మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని బస్సు డ్రైవర్ గా మారారు.నేడు ఏలూరు-దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో సీఎం జగన్ సిద్ధం సభకు మచిలీపట్నం నుంచి వైసీపీ కార్యకర్తలతో కూడిన బస్సును స్వయంగా నడుపుతూ ఏలూరు తీసుకెళ్లారు. ఈ బస్సులో పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు (పేర్ని కృష్ణమూర్తి) కూడా ఉన్నారు