బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి
కడప సిటీ
బహుజన సమాజ్ పార్టీ ఫిబ్రవరి 5 కడప జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు డిఎస్ జయరాం అధ్యక్షతన కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్జే మలికల్ హాజరై నారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలను వేసి రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలి అనే పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ బహుజనలకు రాజ్యాధికార మే లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుందని అందుకు బహుజనులు అందరూ కలిసికట్టుగా బహుజన సమాజ్ పార్టీని బలపరచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్వతంత్రం వచ్చినప్పుడు నుండి 75 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు రెడ్లు మరో 25 సంవత్సరాలు కమ్మ అగ్రకుల సామాజిక వర్గానికి చెందినవారు రెండు కులాల వారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారన్నారు బహుజనలకు ఎటువంటి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయలేదని జనాభా ప్రాతిపదికన బహుజన సంఖ్యను బట్టి రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా కేవలం బహుజనులను వాడుకుంటున్నారని ఆరోపించారు. రానున్న 2024 సార్వత్రిక ఎలక్షన్లలో కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టి బహుజనలందరూ ఏకమై బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా రాజ్యాధికారంలో బహుజనుల యొక్క ఆత్మగౌరవాణి నిలబెట్టుకోవాలని బహుజన్ సమాజ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు వారు పిలుపునిచ్చారు
బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా ఇన్చార్జి బద్వేల్ సమన్వయకర్త సగిలి గుర్రప్ప జిల్లా అధ్యక్షులు డిఎస్ జయరాం మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యశ్రీ కాన్సిరాం ఓటు హక్కు ద్వారా నా బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజులవుతారని అంబేద్కర్ కన్నా కళలను సహకారం చేస్తూ మాన్యశ్రీ కాన్సిరాం ఉత్తర ప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాల ప్రజలను ఎమ్మెల్యేలను, ఎంపీలను చేయడమే కాకుండా నాలుగుసార్లు దళిత శ్రీ బెహన్ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాజ్యాధికారానికి బహుజనులు ఎటువంటి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని రుజువు చేయడం జరిగిందన్నారు. కావున రానున్న సార్వత్రిక ఎలక్షన్లో తమ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునేలా రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలి అనే నినాదంతో పనిచేసి ఏనుగు గుర్తుకు ఓటు వేసి కాన్సిరాం సార్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను అమలు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల వారిని అసెంబ్లీకి పంపించే ఆలోచనతో ఏనుగు గుర్తుపై ఓటు వేసి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఇన్చార్జిలు దానం బాబు జిల్లా ఉపాధ్యక్షులు బాలచంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబయ్య బద్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు గౌస్ పీర్ మైదుకూరు అసెంబ్లీ అధ్యక్షులు నాగార్జున నాగయ్య ఏసోబు భాష మహిళా కార్యకర్తలు బేబీ తదితరులు పాల్గొన్నారు