Tuesday, April 22, 2025

Creating liberating content

తాజా వార్తలుబాధితులకు అండగా జగనన్న ప్రభుత్వం

బాధితులకు అండగా జగనన్న ప్రభుత్వం

వి.ఆర్.పురం :వైఎస్సార్సీపీ జగనన్న ప్రభుత్వం ఎప్పుడు బాధితులకు అండగా ఎప్పుడూ ఉంటుందనీ, రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఇటీవల రేఖపల్లి గ్రామానికి చెందిన గోలి పెద్ద వెంకటేశ్వర్లు భార్య గోలి సరోజిని ఆమెకు ఆపరేషన్ అయ్యింది, అదేవిధంగా కూనవరం గ్రామానికి చెందిన సింగడాల శ్రీను అనే అతనికి కూడా ఆపరేషన్ అయినందుకు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద గోలి సరోజినీకి 30 వేలు, సింగడాల శ్రీనుకి 28 వేలు రూపాయల చెక్కులను శనివారం ఎమ్మెల్యే ధనలక్ష్మి చేతుల మీదగా బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదల బాధలను వారి అవసరాలను గుర్తించి, అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి, వారి అభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల అధ్యక్షులు మాదిరెడ్డి సత్తిబాబు, రాష్ట్ర నాయకులు మాచర్ల గంగయ్య, జే సీ ఎస్ మండల ఇంఛార్జ్ బొడ్డు సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిషన్ సభ్యులు చిక్కల.బాలు, చినమట్టపల్లి సర్పంచ్ పిట్టా రామారావు, మండల నాయకులు ముత్యాల గౌతమ్, బంధం రాజు, మామిడి బాలాజీ, కొమ్మని వీర్రాజు, సూరం సాయి, మోడెమ్ నరేష్, చీమల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article