రేణిగుంట
భారతీయ జనతా పార్టీ రేణిగుంట మండల అధ్యక్షులుగా తనను నియమించినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారికి, బిజెపి రాష్ట్ర కార్యదర్శులు శ్రీకాళహస్తి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారికి,బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ బెస్త చంద్రప్ప గారికి, శ్రీకాళహస్తి అసెంబ్లీ కో కన్వీనర్ శ్రీ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి , బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా పదాధికారులు మరియు మండల ఇన్చార్జి శ్రీ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ బి డి బాలాజీ , శ్రీ వరప్రసాద్ కి
కృతజ్ఞతలు తెలియజేశారు.
బీజేపీ రేణిగుంట మండల అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా బిజెపి రాష్ట్ర ,జిల్లా నాయకులు, మండల కమిటీ నాయకులు, కార్యకర్తల సహకారంతో బిజెపి పార్టీని ఇంటి ఇంటికి తీసుకుని వెళ్లి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరే విధంగా మీడియా సహకారంతో కృషి చేస్తానని, ప్రజలను చైతన్య వంతులను చేసి అనేక మందిని బిజెపి వైపు ఆకర్షితులను చేయడానికి పూర్తి సమయాన్ని వెచ్చించి పార్టీకి పూర్తిగా న్యాయం చేస్తానని తెలియజేశారు.
మండలంలోని లోని ప్రధాన సమస్యలను, సవాళ్లను, పార్టీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకువ రావడం,పరిష్కార దిశగా పనిచేస్తూ పార్టీని విస్తరింప చేయడానికి కృషి చేస్తానని,రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.