తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు కొంగొత్త మలుపులు తిరుగుతున్నట్లు ఆయా పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు, అంతర్గత సమావేశాల నిర్ణయాలు ద్వారా వ్యక్తమవుతోంది.ముచ్చటగా మూడవ సారీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అనేక రకాల ప్రణాళికలు రచిస్తూ,ఆచితూచి అడుగులు వేస్తున్న అపర మేధావి కేసీఆర్ ఈ సారి ఎన్నికల్లో దాదాపు 30 మందికి సీటు నో చెప్పినట్లు గులాబీ కార్యాలయ వర్గాల ద్వారా గుస గుసలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5మంది సిట్టింగులకు ఈ సారి సీటు చిరిగిపోనున్నట్లు ఆయా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఒక వేళ టికెట్ ఆశించి బంగపడిన నేతలు ఏదయినా తోక తిప్పితే బిఆర్ఎస్ అధినేత కర్రుకాచి వాత పెట్టేందుకు దళితబంధు పథకం లో తిన్న చిట్టా విప్పిందే కు కూడా అన్నీ సిద్ధం చేసి నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం. కాబట్టి టికెట్ ఆశించి భంగపడిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి. అయితే వీరికి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలే. అటుకాకుండా స్వతంత్రంగా పోటీ చేసే సాహసం ఏమాత్రం గులాబీ బాస్ గురించి తెలిసిన ఏ ఒక్కరూ చెయరనేది రాజకీయ విశ్లేషకుల భావన.
బిఆర్ఎస్ లో టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు బీజేపీలో కి చేరిన ఎంత మాత్రం ప్రయోజనం ఉంటుందనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న.తెలంగాణ లో ఉన్న 119 నియోజకవర్గ స్థాయిలో భూత్ లెవెల్ కార్యకర్తలు లేని బీజేపీలో కి వస్తే వీరందరికి ఎన్నికల్లో ప్రజాదరణ ఉంటుందా అనే మీమాంసకూడా లేకపోలేదు.పోనీ ఎలాగైనా పోటీ చేసి తీరుతామని ఎన్నికల సందర్భంగా గులాబీ కండువా తీసి కాషాయ కండువా కప్పుకుంటే బిఆర్ఎస్ అవినీతి చేశారు కాబట్టి అక్కడ టికెట్ లేక ఇక్కడి వచ్చారా అని తెలంగాణ సమాజం స్వాగటిస్తుందా అంటే ప్రజలు అంత అమాయకులు కాదనే వాదన వినిపిస్తోంది. పోనీ అటు ప్రజల సంగతి వదిలేసి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళితే ఈ సెకండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలను ప్రజలు ఆదరిస్తారో లేదో అన్న అనుమానాలు కాషాయ దళం నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.సరే బీజేపీ లో లాభం లేదు అనుకుంటే మిగిలింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ స్వయంకృపారాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది జగమెరిగిన సత్యం.అయితే అక్కడిలాగే తెలంగాణ ప్రజలు కూడా అలాంటి తీర్పు ఇస్తారా అంటే అందుకు పరిస్థితులు ఇక్కడ భిన్నంగా ఉన్నాయి.ఎంతయిన తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు కొంత మేలు చేసిందన్న భావన లేక పోలేదు.అందునా రాజకీయ మేధావి,తెలంగాణ రాష్ట్ర సాధన లో ఎన్నో కుయుక్తులు సెంటిమెంట్ ను తెచ్చి రాష్ట్రాన్ని సాధించుకుని 2 పర్యాయాలు ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టి ప్రతిపక్షాలను నామామాత్రాంగా పరిమితము చేసిన కేసీఆర్ ను ఢీకొట్టడం వీలవుతుందా అన్న ప్రశ్న లేక పోలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం లో బిఆర్ఎస్ కాదని బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు అధికారం సాధిస్తాయని ఊహించడం కూడా కొంత అతిశయోక్తి అన్న భావన కూడా మేధావి వర్గాల నుండి వినిపిస్తోంది. కేసీఆర్ చతురత ముందు మిగిలిన రాజకీయ పార్టీలు తెలంగాణా సమాజాన్ని తమవైపు ఏ విదంగా మలుచుకుంటుందనేది వేచి చూడాల్సిందే.