ఇప్పటి వరకూ ఉన్న సస్పెన్స్కి తెర దించుతూ బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేసినట్లు అధి కారికంగా ప్రకటన వెలువడింది. రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కి తన రాజీనామా లేఖని సమర్పించారు.ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమయ్యారు నితీశ్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. “మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతునిస్తాం” అని ఎమ్మెల్యేలు భరోసా ఇవ్వడం వల్ల ఆయన వెంటనే రాజీనామా చేశారు.