ఏలేశ్వరం:-భారతీయ జనతా పార్టీ ఏలేశ్వరం పట్టణ అధ్యక్షునిగా రెడ్డి లావరాజు, బిజెపి కాకినాడ జిల్లా కార్యవర్గ సభ్యునిగా గట్టిం వెంకటరమణలను జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామకుమార్ నియమించారు. ఈ సందర్భంగా చిలుకూరి మాట్లాడుతూ ఏలేశ్వరం పట్టణంలో గత 5 సంవత్సరాల నుండి పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులుగా చురుకుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,సంస్కృతి ఫౌండేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ మన్ననలు పొందిన రెడ్డి లోవరాజు ను, గుర్తించి ఏలేశ్వరం పట్టణ బీజేపీ అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు.రెండు పర్యాయాలు పట్టణ అధ్యక్షులుగా పని చేసిన సీనియర్ నాయకులు గట్టిం వెంకట రమణ ను జిల్లా కార్యవర్గ సభ్యులు గా నూతనంగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిలుకూరి మాట్లాడుతూ ప్రధాని మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి మోడీని గెలిపించుకునే విధంగా నాయకులు ,కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఫిబ్రవరి 9,10,11 లలో మూడు రోజులు పాటు జరిగే గావ్ ఛలో అభియాన్ లో భాగంగా దేశం లో 7 లక్షల గ్రామాలలో ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ప్రవాస యోజన చేయవలసి వుంటుందని, 1000 మంది జనాభా వున్న గ్రామానికి ఒక ప్రవాసి కార్యకర్త ద్వారా 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పేదల సంక్షేమం,మహిళా సాధికారత, దేశ అంతర్గత మరియు బాహ్య భద్రత,సాంస్కృతిక పునర్జీవనం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు . నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన వారికి రైల్వే బోర్డ్ మెంబర్ కొల్లా శ్రీనివాస్, సింగిలిదేవి సత్తిరాజు, దాకే కృష్ణారావు,గొల్లపూడి సత్యనారాయణ, కురాకుల రాజా,కంద వీరాస్వామి ,రాతికింది కృష్ణారావు,మలిరెడ్డి పాప రాజు,గొల్లపల్లి త్రినాధ్ తదితరులు అభినందనలు తెలిపారు.