Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుబీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం

బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం

శ్రీ సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షులు
బికె. పార్థసారథి

శ్రీ సత్య సాయి జిల్లా:

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని శ్రీ సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె పార్థసారథి అన్నారు. జిల్లాలోని నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోరంట్ల పట్టణంలో బుధవారం జరిగిన జయహో బిసి సభలో ఆయన మాట్లాడారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాల పెద్దపీట వేసిందన్నారు. బీసీల జీవన విధానాన్ని మెరుగుపరచడంలో బీసీ సబ్ ప్లాన్ లను ఏర్పాటు చేసి ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. వైసిపి ప్రభుత్వం బీసీల ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మొండి చేయి చూపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీకి బీసీల సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపి వైసిపిని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే బీసీల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. వైసిపి ప్రభుత్వం బీసీలను ఓట్ల కోసమే వాడుకుని పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని దుయ్యబట్టారు. సభలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ జిల్లా లో గత కొన్ని దశాబ్దాలుగా బీసీ నియోజకవర్గాలుగా ఉన్న నియోజకవర్గాలలో రెడ్డి సామాజిక వర్గాలకు వైసీపీ పార్టీ పెద్దపీట వేస్తున్నది అన్నారు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలు మన గడ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు . సభలో జిల్లా ప్రధానకార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ నియోజకవర్గ పరిశీలకులు నరసింహరావు కురుబసాధికారిక సంఘం కన్వీనర్ కురుబగంగలకుంట రమణ, మండల పార్టీ కన్వినర్లు సోమశేఖర్,లక్ష్మీరెడ్డి, యాదవ సాధికారిక జిల్లా అధ్యక్షులు కేశవయ్య, తెలుగుదేశం నాయకులు చిన్న వెంకటరాముడు,శివశంకర్,ఈశ్వర్, బెల్లలా చెరువు చంద్ర, మాజీ జడ్పీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు,మాజీ సర్పంచ్ లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article