Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుబొంతు మహేందర్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వహత్యే

బొంతు మహేందర్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వహత్యే

పిల్లి మాణిక్యరావు (టీడీపీ అధికార ప్రతినిధి)

రాష్ట్రంలో దళితులపై జగన్ రెడ్డి మారణహోమానికి ఎక్కడా బ్రేక్ పడటం లేదని, తమ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న సంఘటనలపై వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు నోరుతెరవలేని దుస్థితిలో ఉన్నారని, ఒక్కరోజు కూడా ఒక్క బాధితుడికి కూడా వారు అండగా నిలవలేకపోయారని, స్వయంగా హోం మంత్రే దళితులపక్షాన మాట్లాడలేని అథమస్థితికి దిగజారిపోయిందని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు.

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!
“ జగన్ రెడ్డి… అతని ప్రభుత్వంలో ప్రధాన బాధితులుగా మారిన దళితుల పక్షాన నిలవాల్సిన హోంమంత్రి, ఇతర దళిత మంత్రులు ఎప్పుడూ జగన్ రెడ్డికి మద్ధతుగా, అతన్నివెనకేసుకొచ్చేలానే మాట్లాడుతున్నారు. దాని పర్యవసానం.. దళితులపై ఈ ప్రభుత్వం సాగిస్తున్న మారణహోమం తాలూకా సెగ ఆఖరికి హోంమంత్రి సొంత నియోజకవర్గానికే తగిలింది.

మహేందర్ మరణానికి పరోక్షంగా హోంమంత్రే కారణం. తక్షణమే తానేటి వనిత తన పదవికి రాజీనామా చేయాలి

హోంమంత్రి తానేటివనిత సొంత నియోజకవర్గం కొవ్వూరులోని దొమ్మేట గ్రామం లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. వైసీపీలోని రెండువర్గాల మధ్య ప్లెక్సీల ఏర్పాటులో తలెత్తిన వివాదంలో దళిత యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. బొంతు మహేందర్ అనే వైసీపీ కార్యకర్తపై అదే పార్టీనేత కేసు పెట్టాడని, అతన్ని విచారణపేరుతో స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు దారుణంగా హింసిం చారు. దళితబిడ్డ.. వైసీపీ కార్యకర్త మహేందర్ని పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేందర్ మరణానికి పరోక్షంగా హోంమంత్రే కారణం. జరిగిన ఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ, ఆమె తక్షణమే తనపదవికి రాజీనామా చేయా లి. నిన్న దొమ్మేటలో జరిగిన ఘటనే కాదు… జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ప్పటినుంచీ రాష్ట్రంలో దళితులే లక్ష్యంగా జరిగిన మారణహోమం మాటల్లో చెప్ప లేనిది. జరిగిన దారుణాలపై ప్రధానప్రతిపక్షమైన టీడీపీ, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, దళితసంఘాలు స్పందిస్తే.. ప్రభుత్వంలోని దళితమంత్రులు పదవీ కాంక్షతో నోళ్లేసుకొని ప్రశ్నించినవారిపై పడిపోతారు. జరిగిన..జరుగుతున్న దారుణాలపై మాట్లాడకుండా.. ప్రశ్నించేవారిని బూతులు తిడుతూ.. జగన్ రెడ్డి దృష్టి లో పడేందుకు నానాపాట్లు పడుతుంటారు.

చంద్రబాబు అనని మాటల్ని అన్నట్టు దళితుల్ని నమ్మించడం తప్ప.. దళితజాతిపై జగన్ రెడ్డి సాగిస్తున్న మారణహోమంపై దళితమంత్రులు నోరెత్తలేరు

కంచికచర్లలో ఇటీవలే దళితయువకుడిపై జగన్ సామాజికవర్గానికి చెందిన హరీశ్ రెడ్డి మూత్రం పోశాడు. డాక్టర్ సుధాకర్ ఉదంతం నుంచి దళిత బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం వరకు జరిగిన దారుణాలపై వైసీపీలోని దళితనేతలు, దళితమంత్రులు మాట్లాడరు.. మాట వరసకైనా నోరెత్తే ధైర్యం వారికి లేదు. వారికి తెలిసిందల్లా … చంద్రబాబు అనని మాటల్ని అన్నట్టు.. సాక్షిమీడియాలో చేసే విషప్రచారాన్ని దళితుల మన స్సుల్లోకి చొప్పించి ప్రయత్నం చేయడమే. చంద్రబాబు దళితుల్ని అలా అన్నాడు..ఇలాఅన్నాడు.. వారిని అవమానించాడు అనే దళిత మంత్రులు నేడు మహేందర్ మరణంపై ఏం సమాధానం చెబుతారు? అతని మరణానికి కారకుడైన పోలీసుల్ని, సొంతపార్టీ నేతల్ని ఏం చేస్తారు? మహేందర్ మృతితో తలెత్తిన అల్లర్ల ను కట్టడిచేసేందుకు వచ్చిన అడిషనల్ ఎస్పీ జీ.వెంకటేశ్వర్లుపై, స్వయంగా హోంమంత్రి సమక్షంలోనే దాడిచేసిన వైసీపీ నేతలపై జగన్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటాడో చెప్పాలి. హోంమంత్రిపై.. ఇతర వైసీపీనేతలపై 307 సెక్షన్లు పెట్టే ధైర్యం పోలీస్ శాఖకు ఉందా? అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టినంత తేలిక కాదు… హోంమంత్రి, వైసీపీనేతలపై కేసులు పెట్టడమంటే. ఎందుకంటే పోలీసులు నిజాయితీగా, నిర్భయంగా పనిచేసే స్థితిలో లేరు.

దళిత న్యాయవాది మందా వేణుగోపాల్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయం

నంద్యాలలో దళిత న్యాయవాది మందా వేణుగోపాల్ వైసీపీనేతల భూకబ్జాలపై కేసులు పెట్టాడని, అతన్ని నడిరోడ్డుపై వైసీపీరౌడీలు చెప్పులతో చావగొట్టారు. తనను ఇలా కొట్టారని వేణుగోపాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్తే, అక్కడి పోలీసులు బాధితుడిపై కేసు పెట్టి.. కొట్టినవారిని వదిలేశారు. న్యాయవాదినే అలా చేసిన వైసీపీ నాయకులు.. వారి కిరాయి రౌడీలు.. వారికి వంతపాడే పోలీసులు సాధార ణ పౌరుల్ని బతకనిస్తారా? తప్పుల మీద తప్పులు చేస్తున్న కొందరు పోలీస్ అధికారులు తీరుతో మొత్తం పోలీస్ శాఖే ప్రజలతో ద్వేషింపబడుతోంది.

పోలీసులకు ధైర్యముంటే తక్షణమే హోంమంత్రిపై హత్యాయత్నం కేసుపెట్టి, ఆమెను అరెస్ట్ చేయాలి

పోలీసులకు నిజంగా ధైర్యముంటే.. వారు నిజంగా చట్టప్రకారం పనిచేసేవారే అయితే, దొమ్మేరు ఘటనలో తక్షణమే హోంమంత్రిపై హత్యాయత్నం.. క్రిమినల్ కేసులు పెట్టి, అదుపులోకి తీసుకోవాలి. చేష్టలుడిగిన పోలీస్ శాఖ.. వైసీపీ కార్యక ర్తల్లా పనిచేస్తూ.. వైసీపీనేతలకు.. ప్రభుత్వపెద్దలకు కాపలాకాస్తోంది. దొమ్మేరు ఘటనపై ప్రశ్నించిన టీడీపీనేతల్ని.. మహేందర్ కుటుంబాన్ని పరామర్శించడాని కి వెళ్తున్న టీడీపీనేతలు.. మాజీ మంత్రుల్ని మాత్రం పోలీసులు సిగ్గులేకుండా అడ్డుకుంటున్నారు. గృహనిర్బంధాల్లో ఉంచి వారికున్నహక్కుల్ని, స్వేచ్ఛను హరిస్తున్నారు. దళితజాతి నాశనమే లక్ష్యంగా అధికారమదంతో వ్యవహరిస్తున్న జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని దళితులు బొందపెట్టాల్సిన సమయం వచ్చింది. సామాజిక సాధికార బస్సుయాత్ర అంటూ దళితుల ముందుకొచ్చే వైసీపీ నేతలు… మంత్రుల్ని దళితజాతి తరమితరిమి కొట్టాలి.” అని మాణిక్యరావు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article