న్యూఢిల్లీ: అత్యంత సమస్యాత్మక, సున్నితంగా భావించే భారత్-మయన్మార్ సరిహద్దు చుట్టూ ఫెన్సింగ్ నిర్మించాలని నిర్ణయించిందిబీజేపీ- ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. మయన్మార్‌తో 1,643 కిలోమీటర్ల మేర సరిహద్దులను పంచుకుంటోంది భారత్. మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్.. రాష్ట్రాలతో సరిహద్దులుగా ఉంటోన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు కూడా మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున వసలదారులు, చొరబాట్లను ఎదుర్కొంటోన్నాయనే ఆందోళన చాలాకాలంగా వినిపిస్తూ వస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ ప్రకటన చేశారు. మణిపూర్‌లో ఫెన్సింగ్ పనులు మొదలయ్యాయని కూడా ఆయన తెలిపారు. మోరే గ్రామ సమీపంలో భారత భూభాగంపై 10 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేశామని చెప్పారు అమిత్ షా. ఈ పనులను వేగవంతం చేస్తామని, ఈశాన్య రాష్ట్రాలను వలసదారులు, చొరబాట్ల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. శరద్ పవార్‌కు బిగ్ షాక్: చీలిక వర్గ నేత చేతికి వెళ్లిన ఎన్సీపీ దీనితో పాటు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ సరిహద్దుల్లో ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున హైబ్రీడ్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను అమర్చుతామని పేర్కొన్నారు. సరిహద్దులను మరింత ఆధునికీకరిచబడంలో తమ ప్రభుత్వం చిత్తశుధ్దితో పని చేస్తోందని స్పష్టం చేశారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోమని, ఈ క్రమంలో బడ్జెట్‌ను సైతం భారీగా పెంచామని అన్నారు.