వాషింగ్టన్‌ః
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అక్కడ ఎన్నికల గురించి చర్చలు నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా బైడెన్ నేనే అధ్యక్ష పదవికి పోటీ పడతానని ప్రకటించారు.
మరో వైపు ట్రంపు కూడా నేను పోటీలో ఉంటానని చెబుతున్నాడు. వీరిద్దరి వయసు 80 దాటి పోయింది. బైడెన్ కు కొంచెం మతిమరుపు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంపు కూడా కొన్ని సార్లు తీసుకునే నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటాయని అంటుంటారు. ఇలాంటి సమయంలో అమెరికన్ పౌరులు ఏం అనుకుంటున్నారు. అమెరికా పౌరులు మాత్రం 80 శాతం మంది ఈ ఇద్దరు అధ్యక్ష పదవి చేపట్టకూడదని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.బైడెన్ బదులుగా కమల హరిస్, ట్రంపు బదులుగా ప్రస్తుతం న్యూయార్క్ మేయర్ గా చేస్తున్న వ్యక్తి ఉంటే బెటర్ గా ఉంటుందని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే వృద్దులు కాకుండా కాస్త వయసులో ఉన్న వారు అధ్యక్ష పదవి చేపట్టి గౌరవం, నిజాయతీ, ప్రజల పట్ల ప్రేమ ఉండే అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బైడెన్ వచ్చిన తర్వాత అమెరికా లాంటి దేశాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి కారణమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ట్రంపు మాత్రం తను నాలుగేళ్ల పదవి కాలంలో ఒక్క యుద్దం చేయకుండా రాకుండా అడ్డుకున్నాడనే పాజిటివిటీ ఉంది. మరి ఈ పాజిటివిటీ ఇలాగే కొనసాగి ముందుకు సాగితే ట్రంపు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పదవికీ పోటీ పడి గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ అగ్రరాజ్యానికి అధ్యక్షుడు అయితే ప్రపంచ దేశాలకు బాస్ లాంటి వారు. అలాంటి వ్యక్తి కి ఎంత ఓర్పు, హుందాతనంతో ఉండాలి. కానీ ట్రంపు మాత్రం కొన్ని చిత్రమైన చేష్టలు చేసేవాడని అక్కడ పౌరులు కాస్త నిరాశలో ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ పౌరుల ముంగిట అతి పెద్ద చాలెంజ్ ఉంది. ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి.