ఏలేశ్వరం:
ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందినదే రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుందని ప్రతిపాడు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పిలుపునిచ్చారు. నగర పంచాయతీ మెప్మా ఆధ్వర్యంలో నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కోనేటివి ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వరుపుల మాట్లాడుతూ పట్టణ పరిధి పరిధిలో 516 మహిళా సంఘాలకు రు 4.49 లక్షల చెక్కులను అందజేయడం జరిగింది అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆయన సంకల్పం అన్నారు.నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పార్టీ సర్వే చేయగా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా వరుపుల సుబ్బారావు పేరు మాత్రమే వినిపించింది అన్నారు. రెండుసార్లు శాసనసభ్యులు గెలిపించిన మీరు మూడోసారి కూడా అంతే అభిమానంతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య, వైస్ చైర్ పర్సన్ శిడగం త్రివేణి వెంకటేశ్వరరావు, అలమండ చలమయ్య, సామంతుల సూర్య కుమార్, తొండారపు రాంబాబు, దళె కిషోర్, అలమండ వీరాస్వామి, పైల శ్రీధర్, జువ్విన వీర్రాజు, కోరాడ ప్రసాద్, కమిషనర్ కే శివప్రసాద్, మెప్మా సిబ్బంది తదితరులు ఉన్నారు.