పెనుకొండ
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను మన రాష్ట్రం లో మహిళలకు కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, పెనుకొండ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే.వి.ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. ఆదివారం
సోమందేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం లో వెలుగు అధికారులు ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉషశ్రీ చరణ్, హిందూపురం ఎంపీ అభ్యర్థి శాంతమ్మ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూతు 2014 లో చంద్రబాబు అపధ్ధాల ప్రచారంతో మహిళలను మోసం చేసాడన్నారు. అతని మాటలు విని మహిళలు నమ్మి మోసపోయారని ఆరోపించారు. పాదయాత్ర చేస్తున్న జగనన్నకు ఈ మహిళలందరూ ఈ మోసాన్ని వివరించారన్నారు . ఆనాడు మహిళళకు మాట ఇచ్చినట్టే నేడు అమ్మఓడి, చేయుత, జగనన్న తోడు, చేదోడు, ఆసరా లాంటి పథకాలతో ఆడవాళ్ళ మీద ఉన్న తన అభిమానాన్ని చాటారని కొనియాడారు. మాట ఇచ్చిన ప్రకారమే రాష్ర్టంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు నాలుగో విడత ఆసరా ద్వార 25 వేల కోట్లు రుణం అందించారని తెలిపారు. ఇందులో భాగంగా సోమందేపల్లి మండలోని 756 సంఘల గ్రుపులలోని 6954 మంది మహిళళకు రూ” 5,93,25,036 /-లు అందించారని,ఇంత గొప్ప సహయం చేసిన జగనన్నను మళ్ళీ సియం చేసుకుందామని మంత్రి ఉషశ్రీ చరణ్ మహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాదేవీ నరసింహమూర్తి, జెడ్పిటీసి అశోక్,ఎంపిపి గంగమ్మ వెంకటరత్నం,కన్వీనర్ నారాయణరెడ్డి,ఐకేపి ఎపియం రామాంజినేయులు, ఈఓఆర్డి నాగరాజురావు, కోఆప్షన్ మెంబర్ రఫిక్, సర్పంచులు రామాంజి,జిలాన్,ఎంపిటిసిలు నాగప్ప, ఈశ్వరయ్య, నాయకులు ఎల్లారెడ్డి, నాగభూషణరెడ్డి, ఆదినారాయణరెడ్డి, గుడిపల్లి కళ్యాణ్, నరసింహమూర్తి తదితర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.