ప్రొద్దుటూరు
రాజుపాలెం మండలం వెళ్లాల గ్రామంలో వెళ్లాల దేవస్థానం కళ్యాణ మండపం నందు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన రైతు సదస్కు పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశతరామిరెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రఘువ రెడ్డి రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ సి భాస్కర్ రెడ్డి, భారతీయ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు సహదేవ రెడ్డి, మాజీ జడ్పిటిసి తోట మహేష్ రెడ్డి వీరు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రాంతమైన నివాస యోగ్యంగా ఉండాలంటే, విద్య వైద్య సదుపాయాలు విస్తృతంగా అభివృద్ధి చెందాలంటే, పరిశ్రమల ఏర్పాటు కావాలంటే ఉపాధి ఉద్యోగవకాశాలు యువత పొందాలంటే మనకు నేటి సదుపాయం చాలా ముఖ్యమన్నారు, ఈ అంశం మహిళలు యువత విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, రైతుల కోసమే నీళ్లు , సంబంధించిన అనుకుంటారు, అన్ని రంగాలకు నీరు అందరికీ అవసరమని సమాజం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాయలసీమ సాగునీటి ఇబ్బందులకు పకృతి సహకరించకపోవడం కంటే, రాజకీయ నాయకుల నిర్లక్ష్యంతోనే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు, స్వతంత్ర భారతదేశంలో రాయలసీమకు ఎన్నడు జరుగునంత ద్రోహం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల జరుగుతున్నాయని తెలిపారు. నీటి పైన ప్రజా ప్రతినిధులు ఎవరు నోరు మెదప లేదన్నారు, ఎవరో వస్తారని, ఎదురుచూసి మోసపోవడం కంటే ప్రతి ఒక్క రాయలసీమ స్వచ్ఛందంగా ప్రతి రైతు ముందుకు రావాలన్నారు, ఇకనైనా ఆలోచిద్దాం రండి.. మన సమస్యల కోల్పోతున్న హక్కుల గురించి ఆలోచించు కొనే బాధ్యత మనందరి పైన ఉన్నది, రాజకీయ పార్టీలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం, వ్యవసాయం ప్రజల బతుకుల పైన రాజకీయ గొడుగు చీకట్లో ఉందన్నారు. నీటి కోసం, నీటి హక్కుల గురించి, తెలుసుకొని కనీసం ఎవరి స్థాయిలో వారు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం, ప్రొద్దుటూరు మండలాల, రైతులు, ప్రజా ప్రతినిధులు, రైతు కూలీలు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.