కడప టిడిపి నగర అధ్యక్షుడుసానపు రెడ్డి శివ కొండ రెడ్డి
కడప సిటీ:కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం 28వ డివిజన్ నందు నగర టిడిపి అధ్యక్షుడు సానపు రెడ్డి శివకొండ రెడ్డి మాట్లాడుతూ వైసిపికి చెందిన “సిద్ధం” పోస్టర్లు చూసి మాదవి రెడ్డి సి- విజిల్ యప్ లో ఫిర్యాదు చేసేందుకు ఫోటోలు తీస్తున్న విషయాన్ని గ్రహించిన వైసిపి నాయకులు వల్లభనేని వంశీ బ్యాచ్ ఆవిడ ప్రయాణిస్తున్న కారును అటకాయించి దాడి కి ప్రయత్నించారుఅన్నారు.మాధవి రెడ్డి కార్లోనే ఉండి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర పోషించారు. విషయం తెలుసుకున్న గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం లోకల్ లో ఉన్నటువంటి టిడిపి నాయకులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకోని ఆమెకు అండగా నిలిచారని అన్నారు.వైసిపి నాయకులు చేసిన పనికి రాష్ట్రంలో ఉండే మహిళలందరూ ఖండించాలిఅన్నారు. ఒక మహిళ అని చూడకుండా వైసిపి నాయకులు రౌడీయిజం ప్రవర్తించడం ఇది అంబేద్కర్ రాజ్యాగమా, వైసీపీ రాజ్యాంగం మా రాష్ట్రంలో ఉండే మహిళలందరూ ఆలోచించాలిఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మహిళాపై 56 మంది వైసిపి కార్యకర్తలు వచ్చి అడ్డగించి దాడి చేయడం చాలా బాధాకరం అన్నారు. తప్పును తప్పు అని ప్రశ్నించే స్వేచ్ఛ రాష్ట్రంలో మహిళలకు లేకుండా పోయిందని శివకోండా రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలొ టిడిపి నగర ప్రధాన కార్యధర్శి జలతోటి జయకుమార్, 28వ డివిజన్ ఇన్చార్జ్ గాజుల పల్లె రాషువ నారాయణ తదితరులు వున్నారు.