రామచంద్రపురం
తిరుపతి జిల్లా ఉద్యాన అధికారి బి. దశరథరామిరెడ్డి గురువారం
రామచంద్రపురం మండలంలోని మామిడి రైతుల పొలాలను పరిశీలించారు. నడవలూరు లోని నాదముని రెడ్డి, లోకనాథ్ రెడ్డి మామిడి పంటలను పరిశీలించారు. ప్రస్తుతం బెంగళూరు, బేనిషా రకాలలో పూతను గమనించడం జరిగిందని, నీలం రకంలో పూత రాలేదని తెలియజేశారు. అయితే కొందరి రైతులకు పూత ఇంకా రాలేదని తెలిపారు. పూత రాని తోటలలో 13-0- 45 ను 10 గ్రాములు + ఫార్ములా- 4 ను 5 గ్రాములు క్లోరిపైరిపాస్ 1.6 మిల్లీలీటర్ + జిగురు 0.5 మిల్లీలీటర్ ను ఒక లీటర్ నీటిని కి కలిపి పిచికారి చేయాలని తెలిపారు. చాలామంది రైతులు సల్ఫర్ కొడితే పూత వస్తుందని అపోహలో ఉన్నారు. ఇది నిజం కాదు సల్ఫర్ కేవలం బూడిద తెగులు సోకిన తోటలకు మాత్రమే వాడాలన్నారు. ఫిబ్రవరి 2వ వారానికి పూత వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పూత రాలుతున్న రైతులు ప్లాన్లో ఫిక్స్ 0.25 మిల్లీలీటర్స్ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి సునీల్ , పూజిత, రైతులు పాల్గొన్నారు.