Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుమా కాపులకు దురద ఎక్కువ అని పవన్ కళ్యాణ్ అంటున్నారు

మా కాపులకు దురద ఎక్కువ అని పవన్ కళ్యాణ్ అంటున్నారు

జాగ్రత్త.. పవన్ కళ్యాణ్ పల్లకి మోయిస్తాడు
మంత్రి అంబటి

ప్రజాభూమిప్రతినిధి,నకరికల్లుః
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి లో సచివాలయం, ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం, షాది ఖానా శంకుస్థాపన కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపులపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సైకిల్ తొక్క లేని చంద్రబాబు, ఆ సైకిల్ తొక్కాలంటే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అడుగుతున్నాడనిమంత్రి అంబటి. పేర్కొన్నారు .మా కాపులకు దురద ఎక్కువ అని పవన్ కళ్యాణ్ అంటున్నారని పేర్కొన్నారు అంబటి. పవన్ కళ్యాణ్ ను మా పవన్ కళ్యాణ్ అంటున్న కాపులను చంద్రబాబుకు అమ్మేస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటున్నారు.. అంతేకాదు ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ గొడ్డు చాకిరీ చేస్తున్నారని.. నిజానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రి కాలేడంటూ చంచలన కామెంట్స్ చేశారు మంత్రి అంబటి. పవన్ కళ్యాణ్ కాపులతో బాబు పల్లకిని మోయిస్తాడంటూ కామెంట్ చేశారు.
అంతేకాదు జనసేన వీర మహిళలు అందరూ బాబు కాళ్లు పిసకాలని.. పవన్ కళ్యాణ్ సీఎం కాదుకదా.. కనీసం , మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి కూడా రాదని తెలిపారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ కొడుక్కి మంత్రి పదవి ఇవ్వని వాడు, పవన్ కళ్యాణ్ కి ఒక సంవత్సరం ముఖ్యమంత్రి ఎలా ఇస్తాడంటూ ప్రశ్నించారు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నమ్మితే.. అతడిని గంగలో కలుపుతాడు.. కనుక కాపులందరూ తన మాట విని పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దని మంత్రి అంబటి రాంబాబు. హెచ్చరించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article