Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుమా వర్గాలన్నింటిని "గాండ్ల కులం"గానే పరిగణించండి

మా వర్గాలన్నింటిని “గాండ్ల కులం”గానే పరిగణించండి

  • జిల్లా స్థాయి కుల గణన సమావేశంలో కలెక్టర్ కు గాండ్ల సంఘ నాయకుల వినతి ప్రజాభూమి, అనంతపురము (కలెక్టరేట్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దు ప్రదేశాల్లో గాండ్ల, తెలికుల, తేలీ తదితర పేర్లతో పిలువబడుతున్న గాండ్ల సామాజిక వర్గాన్ని ఇక నుంచి “గాండ్ల కులం”గానే పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జరిగిన “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల గణన-2023” జిల్లాస్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. గౌతమికి అనంతపురము జిల్లా గాండ్ల సంఘం నేతలు విన్నవించారు. ఈ సందర్భంగా అనంతపురం గాండ్ల సంఘం నాయకులు చింతకుంట రామయ్య, గాండ్ల తెలికుల కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనర్సయ్య వినతిపత్రం సమర్పించారు.
    అనంతరం లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, కోస్తా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లో ఆయా ప్రాంతాల వారీగా వివిధ పేర్లతో పిలువబడుతున్నారన్నారు. రాయలసీమలో గాండ్ల అని, కోస్తాలో దేవతెలికుల అని,
    ఉత్తరాంధ్రలో తెలికుల అని.. తమ కులాన్ని పిలుస్తారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఈ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో వన్నియార్ అని, శెట్టియార్ లేదా చెట్టియార్ అని పిలుస్తారన్నారు. ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ ఇలా ప్రాంతాల వారీగా వివిధ రకాలుగా పిలుస్తున్నారన్నారు.
    ఇలా పిలవబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న తమ కులస్తులను అందరిని ఒకే సామాజిక వర్గంగా గుర్తించి “గాండ్ల కులం”గానే పరిగణించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని
    కలెక్టర్ కు విన్నవించారు. ఇప్పటివరకు కుల గణన జాబితాలో గాండ్ల, తెలికుల అని మాత్రమే ఉందని, ఇకపై మిగతా వారిని కూడా చేర్చి గాండ్ల కులస్తులుగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article