శ్రీ సత్యసాయి జిల్లా
తమకు చెందిన స్థలంలో నిర్మాణాలు చేసుకుంటుంటే
కొందరు అడ్డగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని పెనుకొండ ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు పేర్కొన్నారు. గురువారం పట్టణంలో వాసవి కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ని సర్వేనెంబర్ 393/5ఎ 1ఎ 10 సెంట్ల స్థలం ఉందన్నారు. వెచ్చం చలమయ్య కు చెందిన వంద ఏళ్లకు పైబడిన ఇల్లు ఈ స్థలం లో ఉందన్నారు. 1962 ఏప్రిల్ 29న వెచ్చం చలమయ్య కుమారులు వెచ్చం రామయ్య, వెచ్చం కృష్ణయ్య, వెచ్చం వెంకటాచలపతి లు ఆర్యవైశ్య యువజన సంఘం కు దానవీక్రయం చేసి పెనుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించి ఇచ్చారన్నారు.. ఈ స్థలములో ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున గదులు నిర్మించుకునేందుకు నగర పంచాయతీ లో 6 ఫిబ్రవరి 2023 అనుమతి తీసుకున్నామన్నారు. అనుమతులు తీసుకున్న తర్వాత గదులు నిర్మాణానికి స్థలం శుభ్రం చేస్తుంటే కొందరు అడ్డగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వెల్లుబుచ్చారు వారికి ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా దగ్గర ఉన్న పత్రాలను ఇచ్చామన్నారు. . జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి ఆధార పత్రాలను చూపించామన్నారు వారు రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని పెనుకొండ సబ్ కలెక్టర్, డిఎస్పి లకు ఆదేశాలు ఇచ్చారని వారు వివరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు యాడికి నాగరాజు, నామ రాధాస్వామి, గూండా రవి,గుండా శ్రీకాంత్, దేవతా వెంకటేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.