ప్రొద్దుటూరు
స్థానిక మీడియా వారిపై అనవసర నిబంధనలు విధించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక నెహ్రూ రోడ్డు లోని ఆయన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి 31న మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ భవనంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి మీడియా ను అనుమతించక పోవడం దారుణమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి సమాచారాన్ని చేరవేసే పాత్రికేయులను ప్రవేశించరాదని తెలపడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏనాడు మీడియా తో మాట్లాడరని, అదేవిధంగా ఎమ్మెల్యే లు అనుసరిస్తున్నారన్నారు. బిసి మహిళను మున్సిపల్ ఛైర్మన్ గా నియమించి అధికారం మొత్తం ఎమ్మెల్యే రాచమల్లు, వైస్ ఛైర్మన్ బంగారు ముని రెడ్డి చేతులలో వుంచుకున్నారని, బిసి కి చెందిన ఎమ్మెల్సీ కి కూడా ప్రొద్దుటూరు లో స్వేచ్ఛ లేదన్నారు. ప్రొద్దుటూరు లో కౌన్సిల్ సమావేశానికి మీడియా ను అనుమతించని విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘు రామిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు వెంకట కొండయ్య, అమీర్ బాషా, మాజీ టిడిపి పట్టణాధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.