Tuesday, April 22, 2025

Creating liberating content

తాజా వార్తలుమీ సేవలు ప్రశంసనీయం

మీ సేవలు ప్రశంసనీయం

బదిలీపై వెళ్తున్న, పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులు, పోలీసులకు ఎస్పీ ఆత్మీయ వీడ్కోలు, సన్మానం

అనంతపురము
బదిలీపై వెళ్తున్న, అలాగే పదవీ విరమణ చేసిన అధికారుల సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ అభిప్రాయపడ్డారు. జిల్లా నుంచి ఒక ఏ.ఆర్.అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఆర్ ఎస్ ఐ లు బదిలీ కాగా, డీపిఓ సూపరింటెండెంటు, గుంతకల్లు ఒన్ టౌన్ ఏఎస్సై పదవీ విరమణ చేశారు. ఈరోజు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించి వీరందరికీ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడారు. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్తున్న ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఏ.హనుమంతు, గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, అనంతపురం డీఎస్పీ జి.ప్రసాద్ రెడ్డి, ఆర్ ఎస్ ఐ లు చాలా బాగా పని చేశారన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం, జిల్లాకు వచ్చిన ప్రముఖుల పర్యటన బందోబస్తు, ఇలా కీలక సమయాలలో విజయవంతంగా విధులు చేపట్టారని గుర్తు చేశారు. అదేవిధంగా పదవీ విరమణ పొందిన సూపరింటెండెంట్ శ్రీనివాసులు మంచి సేవలు అందించారన్నారు. మనం చేసే పని కావచ్చు లేదా విధులు కావచ్చు ప్రజల అభిప్రాయమే పోలీసులకు ప్రామాణికమన్నారు. ప్రజలకు సేవలు అందించడం వారితో మమేకమై చట్టబద్ధంగా ముందుకెళ్లడం ముఖ్యమన్నారు. బదిలీపై జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్తున్న పోలీసు అధికారులకు, పదవీ విరమణ చేసిన సిబ్బందిని పూలమాలలు వేసి శాలువాలతో ఎస్పీ సత్కరించారు. అలాగే మెమొంటోలు అందజేశారు.
బదిలీపై జిల్లా నుండీ ఇతర జిల్లాలకు వెళ్తున్న పోలీసు అధికారులు

  • ఎ.హనుమంతు, ఏ.ఆర్ అదనపు ఎస్పీ, అనంతపురం
  • జి.ప్రసాదరెడ్డి, ఎస్డీపీఓ, అనంతపురం
  • యు.నరసింగప్ప, ఎస్డీపీఓ, గుంతకల్లు
  • ప్రవీణ్ కుమార్, ఆర్ ఎస్ ఐ , అనంతపురం
  • మగ్బుల్, ఆర్ ఎస్ ఐ , అనంతపురం
  • బాలాజీ నాయక్, ఆర్ ఎస్ ఐ , అనంతపురం
  • ముస్తఫా, ఆర్ ఎస్ ఐ , అనంతపురం
    పదవీ విరమణ చేసిన ఉద్యోగులు
  • కే శ్రీనివాసులు, సూపరింటెండెంట్, డిపిఓ, అనంతపురం
  • శ్రీనివాసులు, ఏఎస్సై, గుంతకల్లు ఒన్ టౌన్.
    ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయ భాస్కర్ రెడ్డి, జి.రామకృష్ణ, ఎ.హనుమంతు(ఏ.ఆర్), డీఎస్పీలు యు.నరసింగప్ప, జి.ప్రసాదరెడ్డి, బి.శ్రీనివాసులు, సీఎం గంగయ్య, బి.వి.శివారెడ్డి, జి.మునిరాజ ( ఏ.ఆర్), ఎస్బీ సి.ఐ లు జాకీర్ హుస్సేన్, ఇందిర, పిసిఆర్ సి.ఐ దేవానంద్, ఆర్‌.ఐ లు హరికృష్ణ, డిపిఓ ఎ.ఒ శంకర్, రాముడు, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, శివప్రసాద్, ఆర్‌ఎస్‌ఐలు బాలాజీ నాయక్, ప్రవీణ్ కుమార్,మగ్బుల్, రమేష్ నాయక్, ముస్తఫా, ఏ.ఆర్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article