కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దేశవ్యాప్తంగా హస్తం శ్రేణుల్లో జోష్ నింపింది. ఆ ప్రభావంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రైతు, యూత్ డిక్లరేషన్ తో కాంగ్రెస్ మరింత బలం పుంజుకుంది. మరో వైపుకర్ణాటక కాంగ్రెస్ గెలవాలని వ్యూహాలు పన్నుతోంది.. ఎన్నికల సమయానికి కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్ ను రంగోలికి దింపేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.. మరోవైపు కేసీఆర్ ను గద్దె దింపేందుకు కెసిఆర్ వ్యతిరేక కూటమి అంతా కాంగ్రెస్ లోకి రావాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు, ముఖ్యంగా ఈటల రాజేందర్,కొండా విశ్వేశ్వర్ రెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలను కాంగ్రెస్ లోకి రావాలంటూ బహిరంగంగానే కోరుతున్నారు..అంతే గాకుండా టీఆరెఎస్ లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళను సైతం కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తుండడంతో..బీజేపీ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఓ వైపు నాయకత్వ లోపంతో సతమతమవుతున్న బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని గట్టిగానే డిసైడ్ అయింది. అయితే ఇప్పటికే ఉన్న బలమైన నేతలను భారతీయ జనతా పార్టీ సరిగా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సారథ్యంలో పని చేసేందుకు కొంతమంది నేతలు ఆసక్తి లేక ఉద్యమకారులు పార్టీలో చేరడానికి అలాగే పని చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంకొందరు బండి నాయకత్వం ఇష్టం లేక.. పార్టీలో చేరడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. గతంలో రెండుసార్లు మంత్రిగా పని చేసిన ఈటల సేవలను బీజేపీ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైందన్న విమర్శలు ఒక వర్గం నుండి బాగా వినిపిస్తున్నాయి. ఈటలకు పార్టీ అధిష్టానం తగినంత స్వేచ్ఛ ఇవ్వడం లేదని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ సక్సెస్ కావాలంటే.. తెలంగాణ ఉద్యమకారుల, ప్రజల అభిమానం చూరగొన్న బలమైన బీసీ నేత… కేసీఆర్ లోపాలు బాగా తెలిసిన సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ ను బీజేపీ గనుక సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తెలంగాణలో బీజేపీకి ఇక తిరుగే ఉండదని తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పొలిటికల్ సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఇదే డిమాండ్ చేస్తోంది. ఇదే జరిగితే ఉద్యమకారులతోపాటు 70 శాతం బీసీ వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓసీ సామాజిక వర్గాలు కూడా ఈటల వెంట ఉంటారనడంలో ఎలాంటి డౌటూ అక్కర్లేదు.
అంతేకాదు.. బీజేపీ ఎత్తుకున్న బీసీ నినాదానికి కూడా అదనపు బలం చేకూరినట్లవుతుంది. ఐతే బండి సంజయ్ కూడా బీసీ నాయకుడే.. అయితే.. ఆలోచన.. అనుభవం.. సహనం.. ప్రజా బలం… ఇలా ఏ కోణంలో చూసినా.. ఈటలకు ఉన్నంత చరిష్మా బండికి లేకపోవడం పెద్ద మైనస్సే. కర్ణాటక ఫలితాల పాఠాలను బీజేపీ మైండ్ లో పెట్టుకుని… ఈటలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రం బీజేపీ కి తెలంగాణలో బలం పెరుగుతుంది.. అంతేకాదు 75 సంవత్సరాల తర్వాత తెలంగాణ తొలి బీసీ ముఖ్యమంత్రిగా ఈటల హిస్టరీ క్రియేట్ చేస్తారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి.
ఈటల ఢిల్లీ ఎందుకు వెళ్లారు.. చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల ఉన్నా… ఎందుకు చేరికలు జరగడం లేదు…? అమిత్ షా, మోడీ లు తెలంగాణకు వచ్చినా గాని ఎందుకు చేరికలు జరగడం లేదు..
ఈ ప్రశ్నల వెనుక కొన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈటల రాజేందర్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే చాలాంది ఉద్యమకారులు కాషాయ జెండా కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు విశ్వాసనీయ సమాచారం.. అంతే కాదు టీఆరెఎస్ లో చాలా మంది కూడా ఈటల బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని టిఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి