రూ 500 కోట్లతో విశాఖలో ప్యాలెస్ కట్టుకున్నాడు
అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకున్నాడు
వచ్చే ఎన్నికల్లో ప్రజా గుణపాఠం వైయస్సార్ పార్టీకి తప్పదు
రెండు నెలల్లో మా ప్రభుత్వం
శంఖారావ సభలో నారా లోకేష్
హిందూపురం :మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ వెనుక పడేలా చేశాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన శంఖారావ సభలో లోకేష్ మాట్లాడుతూ, వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతకాక ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ వెనక నెట్టేసాడని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట తరహాలో పరిపాలన సాగించి రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్నాడని విమర్శించారు. వైఎస్ జగన్ ది దరిద్రపు పాలన అంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇప్పటికే విశాఖపట్నంలో వనరులను వైకాపా ముఠా దోచుకోవడం జరిగిందని,సరికొత్త వ్యూహాన్ని రచించి భవిష్యత్తులో పూర్తిగా దోచుకుని దాచుకోవడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.రూ.500 కోట్ల ప్రజాధనంతో విశాఖపట్నంలో అన్ని హంగులతో నిర్మించుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కకు పెట్టి ప్రజాధనాన్ని దోచుకోవడం కోసం కుట్రలు,కుతంత్రాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలకులు దృష్టి పెడుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి తో అవకాశం ఉన్న వనరులను యదేచ్చగా దోచుకుంటున్నారన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ వైయస్ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయడానికి వస్తే నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని లోకేష్ విమర్శలు చేశారు. మరో రెండు నెలల్లో తమ కూటమి భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ లో అధికారo లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అరాచక పాలన సాగిస్తున్న వైకాపాకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గుణ పాఠం తప్పదు అన్నారు. బీసీలకు విలువలు లేకుండా చేసి… ప్రజా ప్రతినిధులైన ఆయా వర్గాల వారు ఎలాంటి అధికారo లేకుండా నామమాత్రులను చేస్తున్నది అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో తన పంచన ఉన్న ముఠా ఏమి చెబితే అదే సాగుతున్నదే తప్ప ఏ ప్రజా ప్రతినిధికి విలువలు లేకుండా వైయస్ జగన్ జరుగుతోందన్నారు. దాదాపు 300 మంది బీసీలను హత మార్చడం జరిగిందని, ఆయా వర్గాలకు సంబంధించిన ప్రభుత్వ నిధులను కూడా దారి మళ్లించి అన్యాయం చేశారన్నారు. నందమూరి బాలకృష్ణను వరసగా రెండుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజల అభిమానాన్ని పార్టీ ఎప్పటికీ మరిచిపోదని… తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో నందమూరి బాలకృష్ణ గెలిపించాలని… తాము అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లోనూ మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ శంఖారావసభలో టిడిపి సత్యసాయి జిల్లా అధ్యక్షులు బి కే పార్థసారథి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకుల ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.