కనిగిరి
పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులను కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సోదరుడు కదిరి బాలకృష్ణ దంపతులు గురువారం హైదరాబాద్ లోని అయన నివాసంలో కలిశారు.ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే తన కుమారుడు ఈషాన్ వివాహనికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను చిరంజీవి దంపతులకు అందజేశారు.ముందుగా పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా చిరంజీవి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.