Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుమైనార్టీల చూపు కాంగ్రెస్ వైపు

మైనార్టీల చూపు కాంగ్రెస్ వైపు

డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి

కడప సిటీ :రాష్ట్రంలో మైనార్టీ లందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ పాలనలో మాత్రమే మైనారిటీలకు భద్రత, రక్షణ ఉంటాయని మైనార్టీలు నమ్ముతున్నారని 20 సూత్రాల మాజీ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. ఆదివారం, కడప, రవీంద్రనగర్ లోని యు.ఐ. కళ్యాణమండపంలో దలాజక్ బద్రుద్దీన్ ఖాన్ మరియు పలువురు మైనార్టీలు తులసి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వము పారసత్వ సవరణ చట్టం మొదలుకొని అనేక మైనార్టీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నదని, మైనార్టీలు అభద్రతాభావంలో ఉన్నారని అన్నారు. అటువంటి బిజెపి పొత్తు కోసం, ప్రాపకం కోసం రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేనలు ప్రాకులాడటం శోచనీయమన్నారు. పై మూడు ప్రాంతీయ పార్టీలు బిజెపి చేతిలో కీలుబొమ్మలుగా, కబాళీలుగా, బానిసలుగా తయారవుతున్నారన్నారు. ‘బి’ అంటే బాబు, ‘జె’ అంటే జగన్ ‘పి’ అంటే పవన్ గా రాష్ట్రంలో బిజెపి తయారు అయింది అన్నారు. బాబు పార్టీకి ఓటు వేసినా ,జగన్ పార్టీకి ఓటు వేసినా, పవన్ పార్టీకి ఓటు వేసినా బిజెపికి ఓటు వేసినట్లేనని తులసిరెడ్డి కుండ బద్దలు కొట్టారు. మైనారిటీలకే కాకుండా దేశానికి, రాష్ట్రానికి కూడా బిజెపి ద్రోహం చేస్తుందన్నారు. బిజెపికి జగన్ రెడ్డి ‘బజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు ‘చెక్కభజన నాయుడుగా’, పవన్ కళ్యాణ్ ‘భజన కళ్యాణ్ నాయుడు’గా, మారడం సిగ్గుచేటు అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యా, ఉద్యోగాల్లో ముస్లిం మైనారిటీలకు నాలుగు(4%) శాతం రిజర్వేషన్లు కల్పించాయి. దీని వలన వేలాదిమంది ముస్లిం మైనారిటీలు డాక్టర్లు గా, ఇంజనీర్లుగా, గ్రూప్-1 ఆఫీసర్లుగా అయ్యారన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంగా మైనార్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలు అమలు చేశార న్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లక్షలాదిమంది మైనార్టీలకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేశాయి. మైనార్టీల కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వాలు నెలకొల్పాయన్నారు. రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలోని మైనార్టీలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్, పిసిసి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు విష్ణు ప్రితమ్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వేముల నాగరత్న, పిసిసి రాష్ట్ర కార్యదర్శి చీకటి చార్లెస్, పిసిసి డెలిగేట్ పొట్టి పాటి చంద్రశేఖర్ రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్యామలమ్మ, సంఘ సేవకులు సలావుద్దీన్, కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెప్పలి పుల్లయ్య, సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి లక్ష్మయ్య, ఓ.బి.సి. జిల్లా అధ్యక్షులు చిన్న కుల్లాయప్ప, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరీపుల్ల, సుల్తాన్ మొహిద్దిన్ మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, సమీరా, సుశీల్ కుమార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మామిళ్ళ బాబు, మామిళ్ళ నరసింహులు, ఆసిఫ్ అలీ ఖాన్, బాలం సుబ్బరాయుడు, బోరెడ్డి నరసింహారెడ్డి, వినయ్, అమర్, కోపూరి శ్రీనివాసులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article