లేపాక్షి : సత్య సాయి జిల్లాలో మోడల్ ఫౌండేషన్ పాఠశాల ఎంపికకు ఇద్దరు సభ్యుల రాష్ట్ర బృందం శుక్రవారం జిల్లాలో పర్యటించింది. ఈ బృందంలో రాష్ట్ర కోఆర్డినేటర్ సూరిబాబు తో కలసి జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులు పలు పాఠశాలలను జిల్లా వ్యాప్తంగా పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను ఎంపిక చేయాల్సి ఉండగా సత్య సాయి జిల్లాలో గ్రామీణ ప్రాంతం నుండి ఒక పాఠశాలలు ఎంపిక చేసేందుకు రాష్ట్ర బృందం లేపాక్షి మండల పరిధిలోని నాయన పల్లి ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించారు. ఆ పాఠశాలలో భవనాలు, తరగతి గదుల లభ్యత, ఫర్నిచర్ సౌకర్యాలు, ఉపాధ్యాయుల పనితనం, విద్యార్థుల ప్రతిస్పందనలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా విద్యా విషయక పర్యవేక్షణాధికారి మహేందర్ రెడ్డి, ఎంఈఓ లు నాగరాజు కుళ్లాయప్ప పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇలియాజ్, ఉపాధ్యాయులు, ఐసిడిఎస్ సూపర్వైజర్, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.