Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుయనమల దివ్యకు గెలుపు పూల బాట

యనమల దివ్యకు గెలుపు పూల బాట

తెలుగుదేశంలో చేరిన తుని రాజులు

తుని
రాజవంశీయుల యాక్టివ్ పాలిటిక్స్ తుని పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్‌ అయింది.రాచకుటుంబాల‌ పొలిటికల్ రీఎంట్రీ తెలుగుదేశానికి కలిసొచ్చే పరిణామమన్న మాటలు టాక్ ఆఫ్ ది టౌన్ గా వినబడుతున్నాయి. స్వర్గీయ రాజా బుల్లిబాబు, యనమల కుటుంబాలు రాజకీయ దాయాదులే అయినప్పటికీ అరమరకలు లేని రాజకీయాలతో ఈ రెండు కుటుంబాలు నియోజవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ వచ్చాయి. రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. రాజకుటుంబం కొన్నేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయింది. అయినప్పటికీ ఆ కుటుంబ ప్రతినిధులకు నియోజకవర్గంలో ఒక ఇమేజ్ ఉంది. చెక్కుచెదరని ఆ ఇమేజ్ ఇప్పుడు యనమల దివ్యకు విజయ పూలబాటే. ఇన్నాళ్లు రాజా బుల్లిబాబు గారి కుటుంబానికి దన్నుగా నిలిచిన క్షత్రియులు ఒక్కటయ్యారు.పొలిటికల్ రీఎంట్రీ చేసిన మేజర్ రాజ కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి జై కొట్టాయి. యనమల సోదరుల సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. మార్కండ్రాజుపేటలోని స్వర్గీయ ఆంజనేయరాజు గారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు హాజరయ్యారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్ఆర్వి పృథ్వీరాజ్, దంతులూరి వెంకటరమణ రాజు అలియాస్ బాబు, డివివి అచ్యుతరామరాజు, బీవీ సూర్యనారాయణ రాజు, కే ప్రవీణ్ వర్మ, డి చైతన్య, దంతులూరి దుర్గాప్రసాద్, సతీష్ వర్మ, వానపల్లి సాయి, అడ్డూరి సురేష్ రాజు, తిరుమల రాజు సుమంత్ వర్మ, దండు వెంకట సత్యనారాయణ రాజు అలియాస్ మిలిటరీ రాజు, దంతులూరి సూర్యనారాయణ రాజు అలియాస్ కిషోర్, తిరుమల రాజు సంపత్ వర్మ, వానపల్లి సత్యనారాయణ రాజు తదితరులకు యనమల సోదరులు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ వి శ్రీనివాసరాజు, కోటనందూరు కి చెందిన శివ బాబు, అల్లూరు సత్యనారాయణ రాజు, వర్మ, భీమవరపుకోటకు చెందిన ఎస్ ఆర్ వి రాజబాబు, దెందుకూరు మురళి రాజు, సాయి వేదిక బాబు, ఆదిత్య వర్మ, కోటనందూరు మాజీ ఎంపీపీ చిరంజీవి రాజు, మాజీ కౌన్సిలర్ దంతులూరి శ్రీనివాసరాజు, దంతులూరి వెంకటపతి రాజు, దంతులూరి అచ్యుతరామరాజు, తేటగుంట మాజీ సర్పంచ్ సూరిబాబు రాజు తో పాటు సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు‌, మోతుకూరి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article