టిడిపి కండువాతో సాదరంగా ఆహ్వానించిన జ్యోతులు నెహ్రూ
జగ్గంపేట
జగ్గంపేటలో రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుంటే, అధికార పార్టీ మాత్రం డీలాపడుతుంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి నాయకుల నుండి సామాన్య కార్యకర్త వరకు వైసీపీని వీడి టిడిపిలోకి వస్తున్నారు. తాజాగా ఆదివారం నాడు గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామంలో సుమారు 120 మంది అధికార వైసీపీ నే వీడి టీడీపీ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాయ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం కండువాతో సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని, వైసీపీ పాలనలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. జగన్ అవినీతి పాలనకు చెమరగీతం పాడాలని నెహ్రూ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ నుండి టిడిపిలో జాయిన్ అయినవారిలో
నరుకుల సత్యనారాయణ(నాని బాబు), కసిరెడ్డి రవిబాబు, మాదాసు నరసింహారావు, బోయిడ సూరబ్బు,కడవల వెంకటరమణ, కసిరెడ్డి రాము, కసిరెడ్డి వీరబాబు, కాయల సోమరాజు, కోట బుజ్జి, నవనాసి పెద్ద గణపతి,వట్టికూటి కృష్ణ,నరుకుల సాంబశివ,నరుకుల బాల శ్రీనివాస్,నండూరి ఏడుకొండలు,బెల్లంకొండ చిన్నారావు,నొట్ల అప్పారావు, భీమవరపు అప్పారావు, పిల్లి కృష్ణ, మాదాసు శివన్నారాయణ, పంతం త్రిమూర్తులు, గొల్లపూడి శ్రీనివాస్, నూక తట్టి అవతారం, గంధం స్వామి, పల్లం శెట్టి పండు, పంతం
వెంకటేశులు, పంతం చంద్రన్న, పంతం కాపు,రొక్కం దుర్గారావు వీరితో పాటుగా తమ అనుచరులను 120 మందితో టిడిపిలో జాయిన్ అయ్యారు.