జీలుగుమిల్లి :రానున్న ఎన్నికలలో జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి కోసం నన్ను గెలిపించాలని మాక కుటుంబాన్ని ఆశీర్వదించాలంటూ పోలవరం ఇంచార్జ్ తెల్ల రాజ్యలక్ష్మి అన్నారు. జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం పంచాయతీ గ్రామ నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,పోలవరం వైసిపి అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి సమావేశం నిర్వహించారు.
మంగళవారం ఉదయం అంకన్నగూడెం గ్రామంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రామానికి వచ్చిన తెల్లం బాలరాజు ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి లను గ్రామ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు కలిశారు.ఈ సందర్భంగా పోలవరం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు కరోనా ప్రభావం ఉన్నా సీ.ఎం జగన్ సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు.ఏదైతే మీరంతా నమ్మి బాలరాజు అన్నకు ఓటువేశారో ఆయన మాట ఇచ్చినవి అన్నీ చేశారని అలాగే నన్ను కూడా వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదిస్తే మీకు మరింత సేవ చేసుకుంటానని తెలిపారు.ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ అంకన్నగూడెం పంచాయతీ ప్రజలు ఎప్పుడూ నన్ను,నాకుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని ప్రతీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ అందిస్తున్నారని,అలాగే ఇప్పుడు కూడా నాయకులు,కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని కోరారు.నాయకులు,కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా మా కుటుంబం అండగా ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.