ఒంటిమిట్ట:మండల కేంద్రమైన సిద్ధవటం పశు వైద్యశాలలో శనివారం వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ప్రపంచ జినోసిన్ దినోత్సవం సందర్భంగా శునకాలకు రాబిస్ వ్యాధి సోకకుండా టీకాలు వేశారు ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీదేవి మాట్లాడుతూ శునకాల నుండి రాబిస్ వ్యాధి ప్రజలకు సోకకుండా శునకాలకు టీకాలు వేశావని వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు పల్లె ప్రాంతాల్లో ఉన్న పాడి పశువుల రైతులు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని పశువుల దగ్గర అపరిశుభ్రత లేకుండా చూడాలని ఆమె అన్నారు పశువులు వర్షానికి తడవకుండా రైతులు జాగ్రత్త పడాలని రాబిస్ వ్యాధి పట్ల ఎవరు కూడా ఆందోళన పడవలసిన పనిలేదని ప్రతి ఒక్కరు మీ శునకాలకు టీకాలు వేయించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పశు వైద్య అధికారి డాక్టర్ శివ శంకర్, మహిళ వైద్యాధికారులు డాక్టర్ శ్వేత లైవ్ స్టాక్ అసిస్టెంట్ జిలాని సిబ్బంది నంద్యాల కృష్ణ పాల్గొన్నారు