పులులు సూడో-మెలనిస్టిక్ అని నిపుణుల అభిప్రాయపడతారు.. ఎందుకంటే వాటి శరీరంపై నలుపు, పసుపు చారలు ఉంటాయి. 2,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సిమిలిపాల్ రిజర్వ్.. చిరుతపులులు, ఏనుగులు, ఇండియన్ గౌర్, ఇతర జంతువులకు నిలయం. జంతువులతోపాటు అనేక రకాల పుష్పించే మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాగా, ఇటీవల దక్షిణాఫ్రియా, నమీబియా నుంచి తీసుకొచ్చిన రెండు చిరుతలు అనారోగ్యంతో మరణించాయి.దేశంలో అరుదైన జాతికి చెందిన ఓ పులి చనిపోయింది. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో అరుదైన మెలనిస్టిక్ జాతికి చెందిన మగ రాయల్ బెంగాల్ టైగర్ ఆదివారం చనిపోయింది. ఈ మేరకు అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. పులి మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ.. అనుమానాస్పద అంతర్గత పోట్లాట కారణంగా అది చనిపోయిందని ప్రాథమిక ఆధారాలు సూచించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.రీజనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రకాష్ చంద్ గోగినేని మాట్లాడుతూ.. ‘సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఆదివారంనాడు అరుదైన పులి చనిపోయిందన్నారు. సోమవారం ఆ పులికి శవపరీక్ష నిర్వహించామని, శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా, మరణానికి అంతర్గత పోట్లాటే ప్రాథమిక కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన పులికి, మరో మగ పులికి మధ్య పోట్లాట జరిగిందని చెప్పారు. అయితే, శవ పరీక్ష ఫలితాలు మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని స్పష్టంగా తెలియజేస్తాయన్నారు.2016 ఆల్-ఇండియా టైగర్ సర్వే ప్రకారం.. సిమిలిపాల్ రిజర్వ్‌లో మూడు వయోజన మెలనిస్టిక్ పులులు ఉన్నాయి. ఇటీవలి డేటా జూలైలో అందుబాటులోకి వస్తుంది. సిమిలిపాల్ పులులు మధ్య భారత పులుల విభిన్న వంశంలో భాగం, వీటిలో అప్పుడప్పుడు మెలనిస్టిక్ పులులు ఉంటాయి. రిజర్వ్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ మెలనిస్టిక్ టైగర్‌లకు ప్రపంచంలో వేరే చోటు లేకపోవడం గమనార్హం.