Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలురాయిదాడి కాదు.. కోడికత్తి 2.0 : 22న నామినేషన్ వేస్తున్నా : రఘురామరాజు

రాయిదాడి కాదు.. కోడికత్తి 2.0 : 22న నామినేషన్ వేస్తున్నా : రఘురామరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి జరిగిందని, ఇది రాయిదాడి కాదని కోడికత్తి 2.0 డ్రామా అని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మరో సానుభూతి నాటకానికి జగన్ తెరతీశారన్నారు. జగన్‌పై రాయి దాడి ఘటన వెనుక ఎన్నో సందేహాలున్నాయన్నారు ‘యాత్ర సాఫీగా సాగుతున్న దశలో విద్యుత్తు ఎందుకు ఆగిపోయింది? ఆ క్షణంలో సాక్షి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నిలిచింది? భద్రతా వలయం ఏమైనట్లు? ఘటన జరిగిన వెంటనే పంగలకర్ర ఉపయోగించినట్లు ఎలా చెప్పారు’ అని ప్రశ్నించారు. 

‘సానుభూతి కోసం జరిగిన ముందస్తు నాటకంపై వారు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అయినా జగన్‌మోహన్‌ రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎన్నికల సర్వేలు వ్యతిరేకంగా రావడం, వైకాపా సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో సానుభూతి కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కోడికత్తి డ్రామా కథ ఇంకా సాగుతూనే ఉంది. వివేకా హత్య వ్యవహారంలో కడపలో మొదలైన వ్యతిరేక పవనాలు రాష్ట్రమంతటా వీయడంతో స్వయంగా ఆయనే సానుభూతి కోసం ఇలాంటివి చేయించుకున్నారనే అనుమానాలున్నాయి. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి ఇలా జరగడం, జనాలు లేని ప్రాంతం చూసి గజమాలను ఏర్పాటు చేయడం, దానివెనుకే రాయి తగలడం అంతా సినీ ఫక్కీలో ఉంది. రాళ్లు విసిరితే కేవలం సీఎం జగన్‌కు, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లికి మాత్రమే గాయాలవడం వెనుక మర్మమేంటో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు.కాగా, తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. ఈ నెల 22వ తేదీన నామినేషన్‌ వేస్తున్నా. అయితే ఎంపీనా, ఎమ్మెల్యేనా అనే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొనివుందని ఆయన తెలిపారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article