ప్రముఖ సంస్థ టాటా బిల్డింగ్ ఇండియా వారి నిర్వహణలో పాఠశాల వ్యాసరచన పోటీలో.
ప్రజాభూమి, కామవరపుకోట
ప్రముఖ సంస్థ టాటా బిల్డింగ్ ఇండియా ఏలూరు వారి నిర్వహణలో పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన (అంశం : వ్యర్ధాలను తగ్గించడానికి మరియు రీ-సైక్లింగ్ ను ప్రోత్సహించడానికి మీరు అనుసరించే 5 అలవాట్లు )పోటీలో కామవరపుకోట మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావికంపాడు విద్యార్థులు తెలుగు ఉపాధ్యాయులు బిరుదుగడ్డ నాగేశ్వరరావు శిక్షణలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
జూనియర్ విభాగం లో 8వ తరగతి విద్యార్థులు జి పుష్ప (ప్రధమ )జె యామిని (ద్వితీయ )యస్ హర్షిత (తృతీయ )
సీనియర్ విభాగం లో 9 వ తరగతి విద్యార్థులు కె మానస (ప్రధమ )ఆర్ అక్షయ గంగా భవాని (ద్వితీయ ) యస్ జ్యోష్ణ ప్రియ(తృతీయ )గెలుపొందారు.విద్యార్థులకు ప్రశంసా పత్రం తో పాటుగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి భీమరాజు, బొడ్డు రాములు,టాటా సంస్థ ప్రతినిధి సందీప్,విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యం.పి.టి.సి శ్రీ కె అంజిరెడ్డి, సర్పంచ్ వేముల నాగేశ్వరరావు, సింహాచలం, ఏసుబాబు, ప్రసాదరెడ్డి, గ్రామస్థులు, అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులకు పలువురు అభినందనలు తెలియజేశారు.