కడప సిటీ:ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా రెడ్డి కడప జిల్లా పర్యటన 25వ తేదీకి బదులు 28వ తేదీకి వాయిదా పడిందని, ఆరోజు (28 మార్చ్ 2024 )సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో పెద్ద దర్గా సమీపంలో అమీన్ ఫంక్షన్ ప్యాలెస్ లో సాయంత్రం 6 గంటలకు ఏర్పాటుచేసిన (ఇఫ్థియార్ దావత్) ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైందని.. ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా ఈ విధంగా రాష్ట్రం మాఫియాంధ్రప్రదేశ్ గా మారిందన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్ర ప్రదేశ్ గా మారయన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర లోని అరకు ప్రాంతం టీ తోటలకు ప్రత్యేకత కలిగి ఉండేదని,కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి కి దేశంలోనే పేరుగాంచిన ప్రదేశంగా మారిందన్నారు .గంజాయి వాడకం రాష్ట్రంలో ఏ స్థాయికి వచ్చిందంటే ఒకప్పుడు పెద్దలు మాత్రమే వాడే గంజాయిని ప్రస్తుతం హై స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు కూడా విపరీతంగా వాడుతున్నారన్నారు. ల్యాండ్ మాఫియా ఏ స్థాయికి చేరిందంటే వైకాపా నాయకుల బూదాహానికి వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు ఆయన భార్య పద్మావతి, ఆయన కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైకాపా నాయకులకు తోడు అవినీతి రెవెన్యూ అధికారులు చర్యల వలన ఒక నిండు కుటుంబం బలైపోయింది. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గమనించి బిజెపి బానిస పార్టీలైన టిడిపి వైకాపా జనసేన లను రాబోవు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని తులసి రెడ్డి విలేకరుల సమావేశంలో కోరారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, పిసిసి ఉపాధ్యక్షులు నజీర్ అహ్మద్, పిసిసి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్, పిసిసి డెలిగేట్ పొట్టి పాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆసిఫ్ అలీ ఖాన్, మోపూరు వెంకటరమణారెడ్డి, కొత్తపల్లి మల్లికార్జున రెడ్డి, మూలం రెడ్డి ధ్రువ కుమార్ రెడ్డి, మహబూబ్ బాషా(మాస్), బాలం సుబ్బరాయుడు, సయ్యద్ గౌస్ పీర్, హరిప్రసాద్, వేమా నాగరాజు, సమీరా, అమర్, ఉత్తన్న ,వినయ్ పాల్గొన్నారు.