కడప సిటీ
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మల్లీ సిఎం కావాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని వైఎస్ఆర్ సీపీ నాయకులు 16 వ డివిజన్ ఇన్చార్జి నాగిరెడ్డి ప్రసాద్ రెడ్డి, బూతు కన్వీనర్ కానగల సుబ్బరామయ్య లు అన్నారు. సోమవారం కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గం లోని 16 డివిజన్ ఆర్ పి ఎస్ కాలనీ, మామిళ్ళ పల్లె గ్రామంలో వారు ఎన్నికల యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇంటింటికి పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా వారికి అందిన నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరంగా చెబుతూ, జగన్ న్ను రెండవసారి ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ని మారో సారి ఎమ్మెల్యే గా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు చెబుతూ ప్రచారం చేశారు . ఇందుకు ఆర్ పి ఎస్ కాలనీ ప్రజలు సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ని మెజారిటీతో గెలిపిస్తామని ప్రసాద్ రెడ్డి తో ప్రజలందరూ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, గృహ సారథులు ,ఆర్ పి ఎస్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.