కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగుండ్లకుంటశ్రీరాములు
కడప సిటీ
రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ్లకుంటశ్రీరామలు తెలిపారు. ఆదివారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసినవిలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం వైకాపా,గతప్రభుత్వం తెలుగుదేశంవైఫల్యాలను తెలుపుతూ, కాంగ్రెస్ గతంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ, 2024 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతచేపట్టేఅభివృద్ధి,సంక్షేమకార్యక్రమాలపై విలేకరుల సమావేశంలోవివరించారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం కడపకు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ కోఆర్డినేటర్ సుధాకర్ బాబు రానున్నారని ఈ కార్యక్రమానికి జిల్లాలోని అసెంబ్లీ కోఆర్డినేటర్లు, మండల, పట్టణ అధ్యక్షులుహాజరుకావాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో పిసిసిడెలిగేట్,కమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ పొట్టి పాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.