వేలేరుపాడు:వేలేరుపాడు మండలం రుద్రంకోట గ్రామంలో పవిత్ర గోదావరి నది తీరాన కొలువుదీరిన అభయాంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో, శనివారం తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు, వేద పండితులు తీర్థాల భాస్కర శాస్త్రి ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి మూలవిరాట్ కు అభిషేకాలు నిర్వహించారు, అనంతరం తమలపాకులు ,పసుపు, కుంకుమ, సింధూరం లతో పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు, అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన వాసిరెడ్డి జగన్, గుద్దేటి భాస్కర్, పలివేల రాజారావులు సంయుక్తంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు,