Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలురైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

రైతుల నుండి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

-రైతు మిల్లర్ల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం దు

-రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు

ప్రజాభూమి భీమవరం

రైతులు నుంచి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని దీనిపై రైతుల ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట్రపౌరసరఫరాల,వినియోగదారుల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు.
బుధవారం స్థానిక బివి రాజు కళాశాల అతిథి గృహంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు రైస్ మిల్లర్లకు సంబంధం లేదనే విషం తెలియక, ఇంకా రైతులు అపోహ పడుతున్నారని అన్నారు. రైతు ఆర్ బి కే లో ధాన్యం అప్పగించి రసీదు పొందే వరకే రైతు బాధ్యత అని, తర్వాత మిల్లర్లు పిలిచిన వెళ్లవలసిన అవసరం లేదన్నారు. కొంతమంది మిల్లర్లు రైతులకు ఫోన్ చేసి నూక అవుతుంది మిల్లుకు రావాలని పిలుస్తున్నారనే ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించి జిల్లాలో రెండు రైస్ మిల్లులను సీజ్ చేయడం జరిగిందన్నారు. మిల్లర్లు ఎవరైనా రైతులకు ఫోన్ చేసి రమ్మని కోరిన ఫిర్యాదు అందితే అటువంటి రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. బాయిల్డ్ రైస్ ఐదు లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని, ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులకు, మిల్లర్లకు దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మన ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన చేసి నూతన ధాన్యం కొనుగోలు విధానానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విధానం వలన ప్రతి ఎకరానికి రూ.9 వేలు రైతుకు కలిసి వస్తుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గత సీజన్లో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ధాన్యం కొనుగోలులో ఇంకా చెల్లించాల్సిన 33 కోట్ల రూపాయలు రైతులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అవి కూడా రైతు అకౌంట్లు మిస్ మ్యాచ్ వలన అకౌంట్ లో జమ కావడం లేదని వాటిని సరి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article