Thursday, November 28, 2024

Creating liberating content

సాంకేతికంరైళ్ళపై రాళ్ల వర్షం

రైళ్ళపై రాళ్ల వర్షం

బీహార్‌:రైళ్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ- వాటిపై జరిగే దాడులు కూడా అదే స్థాయిలో ఉంటోన్నాయి. ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకున్న అన్ని రాష్ట్రాల్లోనూ వందే భారత్‌‌పై రాళ్లు విసిరిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఏపీ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. విశాఖపట్నంలో వందే భారత్‌పై రాళ్లు విసిరిన సంఘటన జరిగిన విషయం తెలిసిందే. తాజాగా కేరళలో కూడా అలాంటి ఘటనే సంభవించింది. ప్రధాని ఇటీవలే కేరళలో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. తిరునావయ- తిరూర్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. తిరునావయ స్టేషన్ దాటిన కొద్దిసేపటికే దుండగులు ఈ రైలుపై రాళ్ల వర్షాన్ని కురిపించారు. దీనితో ఒక కోచ్‌ అద్దాలు పగిలిపోయాయి. దీనిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో ఇంకా ఎవరూ అరెస్ట్ కాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో ఒకటి- వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలు దశలవారీగా అన్ని రాష్ట్రాల్లోనూ పట్టాలెక్కుతోంది. ఇప్పటివరకు మొత్తం 16 రైళ్లు వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. కొత్తగా మరో రైలు ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానుంది. బెంగళూరు-హుబ్బళ్లి-ధార్వాడ మధ్య పట్టాలెక్కనుంది. ఈ నెల చివరి వారంలో లేదా జూన్ మొదటివారంలో ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో బెంగళూరు-కాచిగూడ, బెంగళూరు-కోయంబత్తూర్ మధ్య కొత్త సర్వీసులను ప్రారంభించేలా రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఒకే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. చెన్నై-మైసూరు మధ్య రాకపోకలు సాగిస్తోంది.వాటి సంఖ్య పెంచాలనే డిమాండ్‌కు అనుగుణంగా రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. కిందటి నెల 25వ తేదీన ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించారు. రాజధాని తిరునవంతపురం- కాసర్‌గోడ్ మధ్య ఇది రాకపోకలు సాగిస్తోంది. మొత్తం 11 జిల్లాలు- తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, పథనంథిట్ట, మళప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుంది. తిరువనంతపురం నుంచి బయలుదేరే ఈ రైలుకు కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం టౌన్, త్రిశూర్, షోరనూర్ జంక్షన్, కోజికోడ్, కన్నూర్‌లల్లో హాల్ట్ సౌకర్యం కల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article