Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలురైస్ మిల్లు నుండి వస్తున్న వ్యర్ధాలపై గ్రామస్తుల ఆందోళన

రైస్ మిల్లు నుండి వస్తున్న వ్యర్ధాలపై గ్రామస్తుల ఆందోళన

గండేపల్లి.

తమ గ్రామానికి రైస్ మిల్లు అనే పేరుతో ఒక భూతం వచ్చి తమ ప్రాణాలకు హాని కలిగి చేస్తుందని గండేపల్లి మండలం ఎర్రం పాలెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంకటేశ్వర ఆగ్రో ఫుడ్స్ అండ్ రైస్ మిల్ పేరుతో తమ గ్రామానికి ఆనుకుని నిర్మాణం చేయడం జరిగిందని, అయితే అధికారులు కొంతమంది కాసులకు కక్కుర్తి పడి అనుమతులు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు పరిస్థితి దయానికంగా మారిందని గ్రామానికి చెందిన కృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ గ్రామాలకు చుట్టాలు కూడా ఎవరూ రావడం లేదని ఎప్పుడు చూసినా మీ ఇళ్ల వద్ద దుమ్ము ధూళి ఈగలు అధిక శాతం లో ఉంటున్నాయని పిల్లలు పాలు త్రాగుతుంటే గ్లాసుల్లో కూడా పడిపోయి వాంతులు విరోచనాలు తదితర లక్షణాలతో జ్వరాలతో గ్రామస్తులంతా బాధపడుతున్నామని మరి కొంతమంది మహిళలు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా లాభం లేదని కాకినాడ కలెక్టర్ గారికి చివరికి ముఖ్యమంత్రి గారి కూడా మా ఆవేదన తెలియజేయడం జరిగిందని ఎంత ప్రయత్నించినా ఈ మిల్లు నుండి వచ్చే వ్యర్ధాలు ఆగటం లేదని గ్రామస్తులు స్థానిక విలేకరుల వద్ద వాపోయారు. ఈ విషయంపై స్థానిక సెక్రటరీని రవి ప్రసాద్ వివరణ కోరగా రైస్ మిల్లు విషయంలో అప్పట్లో 48 మంది ఆమోదం తెలిపారని అయితే 45 మంది అభ్యంతరం తెలిపారు అన్నారు. మెజారిటీ బేస్ చేసుకుని అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.
ఇప్పుడు గ్రామస్తులు ఆ మిల్లు వల్ల రోగాల భారీపడుతున్నామని చెబుతున్నారు అయితే మిల్లు యాజమాన్యానికి తెలియజేశామని వారు 20 అడుగుల ఎత్తులో ఒక గోడను నిర్మించారని దానివల్ల గ్రామంలోనికి ఏ విధమైన దుమ్ము,ధూళి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article