స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ ఫలితాల నేపథ్యంలో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 70,165.49 పాయింట్ల వద్ద మొదలైంది. పొద్దంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి సెషన్‌లో సూచీలు దూసుకెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 690 పాయింట్లు లాభపడి 71,060కి ఎగబాకింది. నిఫ్టీ 215 పాయింట్లు పెరిగి 21,454కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.88%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.49%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.44%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.23%), టెక్ మహీంద్రా (3.09%).