డీఎస్పీకి లేపాక్షి ఆలయ చైర్మన్ వినతి
లేపాక్షి :
శిల్ప ,చిత్ర కళలకు నిలయమైన వీరభద్రాలయం వెలసిన లేపాక్షి కి అదనపు పోలీసు సిబ్బందిని నియమించాలని డీఎస్పీ కన్జక్షన్ కు లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రమానందన్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామానందన్ మాట్లాడుతూ, ప్రముఖ పర్యాటక క్షేత్రమైన లేపాక్షి కి ఇటీవల కాలంలో పర్యాటకుల సంఖ్య అధికమైందన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ భద్రత సమీక్షించేందుకు, ఆలయానికి వచ్చే పర్యాటకులకు భద్రత కల్పించేందుకు ఉన్న పోలీస్ సిబ్బంది చాలడం లేదన్నారు. చాలీచాలని సిబ్బందితో లేపాక్షి పోలీసులు కూడా పలు ఎదుర్కొంటున్నట్లు చైర్మన్ డి.ఎస్.పి దృష్టికి తీసుకు వచ్చారు. పర్యాటక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు సిబ్బందిని నియమించలేదన్నారు. ప్రతివారం లో శుక్ర ,శని, ఆదివారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దేవాలయ ఆవరణ, పార్కింగ్ స్థలం, తదితర ప్రాంతాల్లో జేబుదొంగల సంచారం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అందుకోసం లేపాక్షి పర్యాటక పోలీస్ స్టేషన్కు అవసరమైన సిబ్బందిని నియమించాలని చైర్మన్ రమానందం డీఎస్పీ కి తెలిపారు. ఇందుకు స్పందించిన డి.ఎస్.పి కన్జక్షన్ త్వరలోనే లేపాక్షి పర్యాటక పోలీస్ స్టేషన్కు సిబ్బంది నియమిస్తామని చైర్మన్కు తెలిపారు.