పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం పోలీసులకు సందేశాలు
ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం బెదిరింపులు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు బెదిరింపుల వెనకున్నది ఎవరో తేల్చేందుకు రంగంలోకి దిగారు. నగరంలో ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు పోలీసులకు సందేశాలు అందాయి.