బుట్టాయిగూడెం/జంగారెడ్డిగూడెం
స్పందిస్తున్న దాతలు
-వరుసగా రెండవ వితరణ పంపిణీ
– లబ్ధిదారుల హర్షం
ఏలూరు జిల్లా,జంగారెడ్డిగూడెం పట్టణ నాల్గవ వార్డ్ ఇందిరానగర్ కాలనీ లో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ ఇటీవల ప్రకటించిన బాలికల భవిష్యత్తుకు ఆర్ధికభద్రత కార్యక్రమంలో భాగంగా సోమవారం మరో బాలికకు 25000 ఆర్ధిక చేయూతను దాతల చేతులమీదుగా అందజేశారు.
ఇందిరానగర్ కాలనీ లో కొలువైయున్న శ్రీఅభయాంజనేయస్వామి వారి సప్తమ వార్షికోత్సవం ఫిబ్రవరి 9 న జరగనున్న నేపథ్యంలో ప్రతీ ఏటా వారధి ట్రస్ట్ నుండి ప్రజాపయోగ కార్యక్రమం వలవల తాతాజీ సారథ్యంలో ట్రస్ట్ ప్రతినిధులు నిర్వహిస్తున్న క్రమంలో 2024 లో ట్రస్ట్ ఎంపిక చేసిన బాలికలకు దాతల సహకారంతో 25000 వారి పేరుమీద పొదుపు చేయడం ద్వారా వారికి భవిష్యత్తులో లక్షరూపాయలు అందించడం ద్వారా వారి ఉన్నతవిద్యకు లేదా వివాహసమయంలో చేయూత నందించడం పధకం లక్ష్యం కాగా సోమవారం ఉదయం శ్రీఅభయాంజనేయస్వామి వారి సన్నిధిలో కోండ్రు శ్రీవల్లి అనే బాలికకు దాతలు సింహాద్రి రామ్ పవన్ 5000,గోపిశెట్టి శ్రీను 5000, ప్రముఖ న్యాయవాదులు మాదేపల్లి క్రాంతి,భువన దంపతులు 5000,ప్రముఖ న్యాయవాది మేకల రామ మోహనరావు,గాయత్రి దంపతులు 5000 మరియు ఉజ్జని చంద్రశేఖర్ 5000 తో కూడిన సంయుక్త దాతృత్వంతో 25000 అందజేసే కార్యక్రమం సోమవారం ఉదయం ఇందిరానగర్ కాలనీ శ్రీఅభయాంజనేయస్వామి వారి దివ్యసన్నిధిలో జరిగింది.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు
మాట్లాడుతూ వలవల తాతాజీ ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ విద్య,వైద్యం,ఉపాధి,సామాజిక ప్రయోజన అంశాల్లో చేస్తున్న కృషికి దాతలు ఇస్తున్న తోడ్పాటు ఆదర్శమని,నిరుపేద బాలికల భవిష్యత్తుకు వారధి ఇస్తున్న భద్రత అభినందనీయమని అన్నారు.
బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి,దాత ఏ వీ వీ భువనేశ్వరి మాట్లాడుతూ పేదరికం వల్ల అనేక అవకాశాలు ముఖ్యంగా బాలికలు అందుకోలేని క్రమంలో వారధి ట్రస్ట్ నుండి వలవల తాతాజీ దాతల అండతో ఇస్తున్న చేయూత బాలికలకు మంచి భవిష్యత్తును అందిస్తుందని అన్నారు.
వలవల తాతాజీ మాట్లాడుతూ వారధి బలం మిత్రులు మరియు దాతలేనని,నిస్వార్థ సంకల్పానికి వారి ఆశీస్సులు అందించబట్టే వినూత్న రీతిలో కార్యక్రమాలు అందించగలుగుతున్నామని బాలికల భవిష్యత్తుకు ఆర్ధిక భద్రత కార్యక్రమంలో వరుసగా ఈరోజు చేసిన సహయం రెండవదని,పొదుపు ద్వారా వీరికి లక్ష ఇవ్వగలగడం ఎంతో తృప్తిని అందిస్తోందని, దాతలకు వారధి తరుపున ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలోజనసేన పార్టీ చింతలపూడి కన్వీనర్,ప్రముఖ న్యాయవాది మేకా ఈశ్వరయ్య, కే ఎల్ ఎన్ ధనకుమార్, మద్దిపాటి శ్రీను,షేక్ మస్తాన్ హసీనా, కలపాల శ్రీనివాస్,పెదవేగి రాంబాబు, కంబాల పండు,
తదితరులు పాల్గొన్నారు.లబ్ధిదారు శ్రీవల్లి కుటుంబం తరుపున తల్లి సురేఖ
వారధి ట్రస్ట్ కు,దాతలకు,వలవల తాతాజీ కి ధన్యవాదాలు తెలిపారు