హిందూపురం టౌన్
హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ వాల్మీకులకే కేటాయించాలని వాల్మీకి యువజన సంఘం నాయకులు ప్రకాష్ రవీంద్రనాథ్ రామాంజనేయులు హనుమయ్య లక్ష్మీకాంత్ తదితరులు కోరారు ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూపురం పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తప్పకుండా వాల్మీకులకు కేటాయించేలా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లు స్వరాచూపాలన్నారు హిందూపురం ఎంపీ స్థానం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున అంబికా లక్ష్మీనారాయణ న్యాయవాది శివశంకర్ దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు న్యాయవాది శివశంకర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ అటు సామాజిక సేవా కార్యక్రమాలు ఇటు పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం ఆయనకు ఎంపీ స్థానం కేటాయించాలని కోరారు అలాగే తెలుగుదేశం పార్టీకి వాల్మీకులు అనాదిగా ఓటు బ్యాంకుగా ఉంటున్నారన్నారు దీని దృష్టిలో ఉంచుకొని అంబికా లక్ష్మీనారాయణ లేదా న్యాయవాది శివశంకర్ లలో ఒకరికి తప్పకుండా టికెట్ కేటాయిస్తే పార్లమెంట్ వ్యాప్తంగా అభ్యర్థి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు తెలిపారు ఈ సమావేశంలో వాల్మీకి యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు