Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలువిద్యార్థినిలకు హెల్త్ ఎడ్యుకేషన్ పై అవగాహన కార్యక్రమం

విద్యార్థినిలకు హెల్త్ ఎడ్యుకేషన్ పై అవగాహన కార్యక్రమం

ప్రజాభూమి పోరుమామిళ్ల:
మదర్ థెరెసా ఫౌండేషన్ మరియు ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంయుక్త ఆధ్వర్యంతో బుధవారం కలసపాడు సెయింట్ ఆంటోనీస్ స్కూల్ నందు హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మీద అవగాహన కల్పించి మరియు ఆడపిల్లలందరికీ మెన్స్ట్రూపీడియా కామిక్ అనే పుస్తకాన్ని అందజేయడం అయినది. ఈ కార్యక్రమంలో మదర్ థెరెసా ఫౌండేషన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ చిత్తా మేరి ప్రజ్వలారెడ్డి ఆడపిల్లలకు నెలసరి సమస్యలపై ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై తీసుకోవాల్సిన ఆహార పద్ధతులపై అవగాహన కల్పించారు. సెయింట్ ఆంటోనీస్ ప్రిన్సిపల్ ప్రభావతి మాట్లాడుతూ తమ పాఠశాల యందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మదర్ థెరెసా ఫౌండేషన్ నిర్వహకులు చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ నిర్వాహకులు చిత్తా థామస్ రెడ్డి, డాక్టర్ ఏరువగీతకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయుని బృందం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article